- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న ఎమ్‌ఐఎం శ్రేణులు అర్ధరాత్రి ఆందోళనలు తీవ్రతరం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి, స్టేషన్ల ఎదుటే బైటాయించి అర్ధరాత్రి నిరసనలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులను తోసుకుంటూ స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్ఐఎమ్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పాతబస్తీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ ఆఫీసు ఎదుట కూడా ధర్నా చేశారు.