- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నదా’.. కేసీఆర్‌పై రఘునందన్ రావు సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: ‘మన ఊరు- మన బడి’లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం బండ లింగాపూర్ హైస్కూల్‌లో పలు పనుల నిమిత్తం ప్రభుత్వం రూ.22 లక్షలు కేటాయించింది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3 లక్షలతో డైనింగ్ హాల్, నాలుగు బాత్రూములు, ఇతర పనులు చేశారు. కానీ, సర్కారు నుంచి రూ.80 వేలు మత్రమే విడుదల చేయడంతో మిగిలిన వర్క్ పెండింగ్‌లో పడిపోయింది. వచ్చిన అరకొర నిధులతో అమ్మాయిలకు టాయిలెట్లు కట్టి వదిలేశారు. సగం పూర్తైన పనుల వల్ల, చుట్టు పక్కల మొత్తం ఇండ్లు ఉండటంతో విద్యార్థినులు టాయిలెట్లకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా.. ఈ సమస్యపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘గొప్పగా ప్రారంభించిన మన ఊరు మన బడి పరిస్థితి ఇది. తెలంగాణ అచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని గొప్పగా చెప్పే హరీశ్ రావు అండ్ కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్తారా?? అన్ని చోట్ల ఇదే దుస్థితి !! ఏడాదిగా ఇదే పరిస్థితి, విద్యార్థుల గోస మీకు పట్టాదా?? ఇదేనా బంగారు తెలంగాణ ??’’ అంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.