'మారుమూల క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నాం'

by GSrikanth |
మారుమూల క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నాం
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నదని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలను బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు, జిల్లా అధ్యక్షుడు వీరన్న, ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాయపురం వెంకన్న, కట్ల వెంకట్ నారాయణ, చర్లపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story