- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ దెబ్బ రుచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూడబోతున్నదన్నది: BJP
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం అప్పజెప్పారని, పరిపాలన మొదలుపెట్టి ఆరు నెలలు దాటినా నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నదని బీజేపీ నేత విఠల్ ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీపైనా, నిరుద్యోగులకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, పలు డిక్లరేషన్లను ప్రకటించిందని, కానీ ఇప్పటివరకూ వాటి అమలుపై ఊసే ఎత్తడంలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రెండు లక్షల ఖాలీ పోస్టులను జూన్ 2వ తేదీలోగా భర్తీ చేస్తామంటూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే స్పష్టంగా చెప్పినా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి రావడం కోసం హామీలిచ్చి ఇప్పుడు నిరుద్యోగులను నిర్లక్ష్యంగా గాలికి వదిలేసిందని, గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే ఇకపైన కాంగ్రెస్ కూడా ఆ దెబ్బ రుచి చూడబోతున్నదన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోగా రాష్ట్ర ప్రభుత్వంలో సర్వీసులో ఉన్న సుమారు 50 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ కాబోతున్నారని, వాటి స్థానంలో కొత్తగా రిక్రూట్‌మెంట్ ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల్ని తక్షణం భర్తీ చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ కూడా పారదర్శకంగా జరగాలన్నారు. నిరుద్యోగులతో చెలగాటమాడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందన్నారు. నిరుద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని, నిరుద్యోగులవైపే బీజేపీ నిలబడుతుందన్నారు.