'పండగపూట కూడా KCR సర్కారు జీతాలు ఇచ్చేలా లేదు'

by GSrikanth |
పండగపూట కూడా KCR సర్కారు జీతాలు ఇచ్చేలా లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగపూట జీతాల టెన్షన్ పట్టుకుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే బతుకమ్మ, దసరా పండుగలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైందని, ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలిచ్చేలా లేదని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. సరైన సమయానికి వేతనాలు వస్తాయా? లేవా? అనే డైలమాలో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఈ విషయంపైనే ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోందన్నారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతునే ఉన్నాయని... గతేడాది కూడా పండుగ తర్వాతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తుండటంతో.. అక్టోబర్‌లోనూ అలాగే లేట్ అయితే, పండుగలకు పైసలెట్ల? అనే ఆందోళన మొదలైందని తెలిపారు. కానీ, వేతనాలను ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే ఆలస్యంగా అందిస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారిందన్నారు. ఏం కేసీఆర్.. ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు? త్వరలో సర్కారీ ఉద్యోగులే..కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టడం ఖాయం అంటూ విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed