- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అలా భావిస్తే అది పొరపాటే: తరుణ్ చుగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరగడం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని కీలకాంశాల్లో ఒకటని, అందుకే విద్యార్థులు, యువత ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమాన్ని ముందుండి పోరాటాలు చేసి తెలంగాణను సాధించారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగులకు నిరాశే ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 ఏండ్ల తర్వాత వేయక వేయక అతికొద్ది నోటిఫికేషన్లు వేసిందని, కొలువుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పగలనక, రాత్రనక చెమటోడ్చుతున్నారన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయి నిరుద్యోగులు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ సర్కార్ పోలీసులను ప్రయోగించి వారిపై క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రం లీకేజీపై నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ పీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బీజేవైఎం నాయకులను రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జైల్లో నాలుగు గోడల మధ్య తమ నేతలను బంధించి బీజేపీ కార్యకర్తలను ఆపుతామని కేసీఆర్ భావిస్తే అది పొరబాటే అవుతుందని తరుణ్ చుగ్ చురకలంటించారు.
న్యాయం కోసం శాంతియుత ర్యాలీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని చుగ్ ఖండించారు. ప్రస్తుత సంక్షోభానికి కేసీఆర్ అసమర్థత, నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శలు చేశారు. దీనికి కేసీఆరే బాధ్యుడని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న వారిని అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టి, అసలు దోషులను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ఈ కుంభకోణంపై కేసీఆర్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదని, దాపరికం ఏమీ లేకపోతే కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.