- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వాళ్లను కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్.. మాట మర్చిపోయారా?’
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కిలాడీ కేసీఆర్ పాలన కొనసాగుతోందని బీజేపీ సీనియర్ నేత, తమిళనాడు సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మహిళలపై కన్నెత్తి చూస్తే కను గుడ్లు పీకుతానన్న కేసీఆర్ మాట ఏమైందని ప్రశ్నించారు. స్త్రీలపై దాడులు జరుగుతుంటే కేసీఆర్ మౌనం వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఒక్క రోజు దీక్ష కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో 7 వందల మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందంటే అది తెలంగాణలో కేసీఆర్ పాలన గొప్పతనం అని ఎద్దేవా చేశారు. ఇకనైనా కేసీఆర్ ఓట్ల రాజకీయం మానుకుని ప్రజలకు మేలు కలిగించే పనులు చేపట్టాలని సూచించారు. మోడీకి లెటర్ రాసే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణకు పట్టుకున్న చంద్రగ్రహణం వీడాలంటే బీజేపి అధికారంలోకి రావాలని అన్నారు.