- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలిసి పనిచేద్దామని.. జూపల్లికి బీజేపీ ముఖ్య నేత ఫోన్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును భారతీయ జనతా పార్టీలోకి రావలసిందిగా మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు. అధికార బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్‌కు గురైన తర్వాత డీకే అరుణ జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేసి అన్నా భారతీయ జనతా పార్టీలోకి వస్తే మనకు అంతా మంచి జరుగుతుంది.
వేరే ఆలోచనలు చేయకుండా భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటానని జూపల్లి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీకే అరుణను పాన్గల్ జడ్పిటీసీగా పోటీ చేయించి గెలిపించడంలో జూపల్లి ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం ఇరువురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కొనసాగారు.
ఆధిపత్య పోరు కారణంగా అప్పట్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం జూపల్లి కృష్ణారావు గత నాలుగు సంవత్సరాల నుండి అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ జూపల్లి ఆ పార్టీలో చేరకపోవడంతో డీకే అరుణ అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె స్వయంగా పార్టీలోకి రావాలని కోరుతూ ఫోన్ చేయడం ఆసక్తిగా మారింది. జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ మంచి పట్టును సాధించడానికి అవకాశాలు మెరగవుతాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.