- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశానికి రాహుల్ గాంధీ హానికరం: సుభాష్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశానికి హానికరంగా మారారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శలు చేశారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను ఎప్పుడూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశానికి డ్యామేజర్ గా తయారయ్యారని శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై సుభాష్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన విమర్శలు చేశారు.
అందుకే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ ని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ చేసిన ఆరోపణలను ఎన్వీ సుభాష్ కొట్టిపారేశారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని, చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరం చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా దూసుకుపోతుండడం, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ అర్థంపర్థం లేని ఆరోపణలను చేస్తోందని ఎన్వీ సుభాష్ విమర్శించారు.