రుణమాఫీ ఆ స్టంటే.. బీజేపీ నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-16 06:04:09.0  )
రుణమాఫీ ఆ స్టంటే.. బీజేపీ నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. మంగళవారం నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ మాత్రమే అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదని.. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మోసపూరిత ప్రకటనలు చేశారన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్రలు అని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటే అన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

Advertisement

Next Story