- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఔర్ ఏక్ ధక్కా.. బీజేపీ పక్కా: కర్ణాటక ఎన్నికలపై జితేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఔర్ ఏక్ ధక్కా.. బీజేపీ పక్కా అంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ఇది.. ఏ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని సందోహం. ప్రజలు బీజేపీపై చూపిన ప్రేమ, వాత్సల్యాలను మునుపెన్నడూ ఎక్కడా ఎవరూ చూడలేదు. జనక్షేత్రంలో ప్రజాదేవుళ్ల నిర్ణయంతో కమలం పులకించి పోవడం ఖాయం’’. అంటూ రాసుకొచ్చారు
కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు
కర్ణాటకలో కమలానికి ఇంతటి జనాదరణను చూస్తుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున వారే పోటీ చేస్తున్నట్టుగా, వారే పోరాడుతున్నట్టుగా అనిపిస్తోందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిషేధిత పీఎఫ్ఐ అజెండాను కాంగ్రెస్ పుణికి పుచ్చుకుందని, ఆ అజెండా మేరకే పని చేస్తుందని విమర్శించారు. అలాంటి పార్టీకి ప్రజలు దూరంగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నానన్నారు.
కర్ణాటక ప్రజలంతా బీజేపీకి పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బజరంగ్‌దళ్‌ను నిషేధించాలని ప్రతిపాదించడం ద్వారా హిందూ విశ్వాసాలను అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పిద్దాం.. కమాలానికి మళ్ళీ రాచబాట వేద్దాం’ అని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read...
పొంగులేటి పార్టీ మార్పు సస్పెన్స్‌కు ఆ రోజే తెర..? ఉత్కంఠ రేపుతోన్న మాజీ MP డెసిషన్