- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవి కేసీఆర్ కుటుంబానికి అలవాటే: DK Aruna
దిశ, తెలంగాణ బ్యూరో: కక్ష సాధింపులు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అలవాటని, అలాంటివి బీజేపీలో ఉండవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై డ్రగ్స్ కేసు ఇప్పటికే నడుస్తోందని, ఇది కొత్తగా ఓపెన్ చేసిన కేసు కాదన్నారు. గతంలో కొన్ని రోజుల పాటు ఛానళ్లలో ఇవే వార్తలు నడిచాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఈడీ ఊరికే ఎందుకు నోటీసులు ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. నోటీసులు అందుకున్న వారు తప్పు చేయకుంటే భయమెందుకని ఆమె నిలదీశారు. నోటీసులకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.
ఫామ్ హౌజ్ కేసు దొంగ కేసు అని అందరికీ తెలిసిందేనని ఆమె విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు బయటకు వచ్చాక ఫామ్ హౌజ్ కేసు బయటకు వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. టీఆర్ఎస్ నేతలకు అన్నీ ఇలాగే కనిపిస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఏ డ్రామా చేయమంటే.. ఆ డ్రామా చేశారు కాబట్టే నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు హీరోలు, ఆణిముత్యాలు అయ్యారని ఎద్దేవా చేశారు. హీరోలు, ఆణిముత్యాలు అనుకుంటే ప్రగతి భవన్‌లో ఎందుకు బంధించినట్లని ఆమె ప్రశ్నించారు. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ ఈడీ వస్తుందని, అవినీతి చేయకుంటే భయమెందుకని డీకే అరుణ ప్రశ్నించారు.