- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ప్రజల్లోకి బీజేపీ.. ఈసారి భారీ వ్యూహరచన..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బలోపేతం కావాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. హస్తం పార్టీని ఇరుకున పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక అంశాలన్నింటినీ ప్రజలకు వివరించాలని ఇప్పటికే డిసైడ్ అయింది. త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పాదయాత్రలు చేస్తూ చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కమలం పార్టీ వ్యూహ రచన చేసుకుంది. డిసెంబర్ లో పాదయాత్రలు చేపట్టి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు, ప్రజలకు చేసిన మోసాలను వివరించాలని నిర్ణయం తీసుకుంది.
ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో బీజేపీ యాక్షన్ మోడ్ లోకి వెళ్లాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయింది. ‘ఎండ్ లెస్ టేల్ ఆఫ్ బ్రోకెన్ ప్రామిసెస్’ పేరిట ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో సైతం కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు భారీ వ్యూహ రచనను సిద్ధం చేసుకుంది. గులాబీ పార్టీని కాదని హస్తం పార్టీని నమ్మి ఓట్లేస్తే ప్రజలకు వారు చేసిందేంటని నిలదీయనున్నారు. బీఆర్ఎస్ వ్యవహరించిన తీరునే కాంగ్రెస్ కూడా అమలుచేస్తోందని చెప్పనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ సామాన్యుల సంక్షేమం ఇచ్చిన హామీలు ఒకవైపు, అధికారంలోకి వచ్చాక సీఎంను వ్యతిరేకించిన తీరు ఒకవైపు ప్రదర్శించేలా ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసీఆర్ ను కాదని రేవంత్ కు ఓటేస్తే ఆయన మాత్రం ఏం చేశారని ప్రశ్నించనున్నారు.
ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు మినహా ఏ పథకం అమలు కావడంలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చూస్తోంది. అలాగే గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్లు, సామాన్యులు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, యువత వంటి రంగాల వారీగా విశ్లేషణాత్మకంగా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో సీఎం ఇంటి ఎదుట బీఈడీ అభ్యర్థులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపడం, రేవంత్ శవయాత్ర చేసిన తీరును ప్రజలకు ప్రదర్శించాలని చూస్తున్నారు. అతి తక్కువ కాలంలో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ, నమ్మకం, విశ్వాసం కోల్పోయిన వ్యక్తి రేవంత్ అని నిరూపించాలని ప్లాన్ చేసుకున్నారు.
పార్టీ కోర్ కమిటీలో ప్రధానంగా మూడు కీలక నిర్ణయాలు బీజేపీ తీసుకుంది. శనివారం ధాన్యం కొనుగులు కేంద్రాలను సందర్శించనుంది. దీనికి కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందాలు వెళ్లనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లి గ్రామాల్లో కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇండ్లలో బీజేపీ నేతలు నిద్ర చేయనున్నారు. ఒక రోజు రాత్రి అక్కడే బస చేయడం, భోజనం, మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా మూడోది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అసెంబ్లీల వారీగా పాదయాత్రలు, సభలు నిర్వహించి నిరసనలు చేపట్టి ప్రజలకు వివరించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉండగా బీజేపీ డిసెంబర్‌లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈ పాదయాత్రలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తారా? లేక సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలతో చేయిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పాదయాత్రలతో పాటు నియోజకవర్గాల్లో సభలు సైతం నిర్వహించాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహరచన చేస్తోంది. మరి బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి.