- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ ఆధ్వర్యంలో 11 వేల సభలు .. త్వరలో ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ప్రతిక్షణం పని చేస్తున్నామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని ఈ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పారు.
బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతోందని సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 11 వేల సభలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గాల్లో సభలు ఉంటాయని, అసెంబ్లీ సెగ్మెంట్లలో వందకు పైగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభలకు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని తెలిపారు. చివర్లో హైదరాబాద్ లో 'ప్రజాగోసా- బీజేపీ భరోసా' పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.