తెలంగాణలో 50 లక్షల టార్గెట్.. ఆలోపే పూర్తి చేసేలా ప్లాన్..!

by Gantepaka Srikanth |
తెలంగాణలో 50 లక్షల టార్గెట్.. ఆలోపే పూర్తి చేసేలా ప్లాన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఈనెల 17వ తేదీన ఢిల్లీలో సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్‌ నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. తెలంగాణలో మొత్తంగా 50 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జులను నియమించనున్నారు. కాగా, ఈ ఏడాది డిసెంబరులోపు బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుంచే ప్రక్రియ మొదలైంది.

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేలోపే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల పార్టీ యూనిట్లను బలపర్చాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా 2020 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పదవీకాలంతో ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆయన పదవీకాలం గత ఏడాది ముగియడంతో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నడ్డా పదవీకాలాన్ని 2024 వరకు పొడిగించారు. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోవాల్సి ఉండడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో పడింది బీజేపీ.

Advertisement

Next Story

Most Viewed