- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ ప్లాన్.. 4 హెలికాప్టర్లు రెడీ
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేస్తుండటంతో తెలంగాణ బీజేపీ కూడా అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా సుడిగాలి పర్యటనలకు రెడీ అవుతోంది. దీని కోసం హెలికాప్టర్లను కూడా బుక్ చేసింది. పార్టీ సభల కోసం ఏకంగా నాలుగు హెలికాప్టర్లను బుక్ చేసింది. రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
119 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే 55 మంది పేర్లతో తొలి జాబితాను రెడీ చేయగా..ఏ క్షణమైనా ప్రకటించనున్నారని సమాచారం. తొలి జాబితాలో ఈటల రాజేందర్ పేరు ఉండగా.. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. ఇక కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు జాబితాలో ఉండనుంది. రాజాసింగ్ పేరు కూడా గోషామహల్ నుంచి ఉండనుందని వార్తలొస్తున్నాయి.