- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రాష్ట్రపతి పాలన..? పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సంచలన నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈనెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తం పార్టీ వైపే మొగ్గు చూపాయి. అయినా ఇతర పార్టీల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్‌తో రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఎవరి అంచనాలు ఎట్లున్నా.. ఏ పార్టీకి మెజార్టీ రాదని, ఈసారి రాష్ట్రంలో వచ్చేది హంగ్ వస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్లవని, దాంతో తమ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ పాత్ర కీలకంగా మారబోతోందని చెప్తున్నారు.
ఎగ్జిట్స్ పోల్స్‌పైనే డిస్కషన్
తెలంగాణలో ప్రజెంట్ ఎగ్జిట్ పోల్స్‌పైనే చర్చ జరుగుతోంది. ఇవి ఎంత మేరకు నిజం అవుతాయోననే డిస్కషన్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నది వాస్తవమే అనేది పబ్లిక్ టాక్. దాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ కాస్త వెనుకంజలో పడిందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్.. పబ్లిక్‌కు రీచ్ అయినా పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకూ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. కాషాయ పార్టీ నేతలు కూడా దీనిని విశ్వసిస్తున్నారు. హంగ్ వస్తే తామే కింగ్ మేకర్లమవుతామని భావిస్తున్నారు. అదే జరిగితే ఎవరికీ మద్దతు తెలుపకుండా రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతామని ఆ పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు.
బీజేపీ ప్లాన్ ఇదే
అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులై.. హంగ్ ఏర్పడితే.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఇలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే తాము ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే.. కాషాయ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఉండకూడదని, అందుకే హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాలన విధించాలని, ఆ తర్వాతే కొత్త సర్కార్ ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో ఉన్నారు. తాము ఎవరికి మద్దతిస్తే.. వారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెబుతున్నారు.
కింగ్ మేకర్లు ఎవరు..?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ గంపెడాశతో ఉంది. గ్రేటర్ పరిధిలోనే దాదాపు 9 స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా గోషామహల్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, అంబర్ పేట, ముషీరాబాద్ స్థానాలు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కరీంనగర్, నిర్మల్, బోథ్, కామారెడ్డి, ముథోల్, హుజూరాబాద్, కోరుట్ల, కల్వకుర్తి, మక్తల్‌తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ గెలుస్తామని ఆ పార్టీ వారు అనుకుంటున్నారు. హంగ్ వస్తుందని, తాము అధికారంలోకి వస్తామని బీఎల్ సంతోష్ గతంలోనే చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం ఫలిస్తుందని పలువురు బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. వారు భావిస్తున్నట్లుగా వార్ వన్ సైడ్ అవుతుందా? లేక హంగ్ ఏర్పడి కమలం నేతలు కింగ్ మేకర్లు అవుతారా? అనేది చూడాలి.