బిగ్ న్యూస్.. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. అక్కడనుంచి జనసేనకు సీట్లు

by Javid Pasha |
బిగ్ న్యూస్.. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. అక్కడనుంచి జనసేనకు సీట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారు అయింది. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో జనసేనకు బీజేపీ కొన్ని సీట్లను కేటాయించేందుకు సిద్దమైంది. ఇవాళ బీజేపీ తొలి జాబితా రానుండగా.. జనసేనతో పొత్తుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది. తొలుత ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ భావించినా.. అంతగా బలం లేకపోవడంతో జనసేనను కూడా కలుపుకునేందుకు రెడీ అయింది.

ఇటీవల తెలంగాణలో కలిసి పోటీ చేయడంపై పవన్ కళ్యాణ్‌తో బీజేపీ నేతలు కిసన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. పవన్ ఇంటికి వెళ్లి పొత్తులపై మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది బీజేపీకి బాగా కలిసిరావడంతో అత్యధిక సీట్లను గెలుచుకుంది. తెలంగాణవ్యాప్తంగా పవన్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీంతో జనసేనను కలుపుకుంటే లాభం జరుగుతుందనే ఉద్దేశంతో చివరిలో టీ బీజేపీ ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. పవన్ తొలుత 30 సీట్లతో ఒంటరిగా జనసేన అభ్యర్థులను పోటీలోకి దింపాలని భావించారు. బీజేపీ పొత్తుకు ఆహ్వానించడంతో పార్టీ నేతలతో చర్చలు జరిపారు.

ప్రస్తుతం పవన్ ఎలాగూ ఎన్డీయేలో కొనసాగుతున్నారు. దీంతో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. శ్రేణులతో చర్చించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ఇటీవల పవన్ తెలిపారు. దాదాపు బీజేపీతో కలిసేందుకు పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో బండి సంజయ్, డీకే అరుణ పాల్గొన్నారు. ఈ భేటీలో జనసేనతో పొత్తు గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story