- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy Genie: స్విగ్గి జెనీలో హైదరాబాద్ మహిళకు చేదు అనుభవం.. లాప్‌టాప్ దొంగిలించిన ఏజెంట్
దిశ, డైనమిక్ బ్యూరో: స్విగ్గి జెనీ డెలివరీ యాప్‌లో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. డెలివరీ కోసం ఇచ్చిన లాప్‌టాప్ ను డెలీవరీ బాయ్ దొంగిలించాడు. అంతేగాక లాప్ టాప్ తిరిగి ఇవ్వాలని అతన్ని సంప్రదించడంతో 15 వేలు డిమాండ్ చేశాడు. హైదరాబాద్ కు చెందిన నిషిత గూడిపూడి మాదాపూర్ లో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. తన లాప్‌టాప్ బ్యాక్‌ప్యాక్ ని మాదాపూర్ ఏరియాలో ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్ కు తరలించడానికి తన భర్త స్విగ్గీ జెనీ డెలివరీ యాప్‌లో బుక్ చేశారు. బుకింగ్ ని తీసుకున్న డెలివరీ ఏజెంట్ రైడింగ్ మధ్యలోనే ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసుకున్నాడు.
దీంతో కంగారు పడ్డ ఆమె భర్త స్విగ్గీ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. ఆ సమయంలో వారు తమ బుకింగ్ లో ఉన్న డెలివరీ ఏజెంట్ ను గుర్తించలేకపోయినట్లు తెలిపింది. పార్శిల్ తీసుకునే సమయంలో వచ్చింది ఎవరో గుర్తించాలని తమకు రెండు ఫోటోలు పంపడంతో ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పింది. తర్వాత వాట్సాప్ ద్వారా డెలివరీ ఏజెంట్ ను సంప్రదిస్తే.. అతడు తన స్నేహితుడి లాగిన్ ఐడీని ఉపయోగించానని చెప్పాడని, లాప్ టాప్ ను రాపిడో ద్వారా పంపించేందుకు 15 వేలు డిమాండ్ చేశాడని, దీనికి సంబంధించిన వాట్సాప్ సంభాషణను షేర్ చేసింది. దీనిపై స్విగ్గీ సంస్థ స్పందిస్తూ. మా వినియోగదారుల భద్రత, నమ్మకాన్ని కాపడడం మా మొదటి ప్రాధాన్యత అంటూ.. ఈ సంఘటనలో పాల్గొన్న డెలివరీ ఏజెంట్ ను తొలగించడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.