‘బిర్యానీ బీర్’ తాగితే తిన్నట్లేనా..? తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్స్ ఎంట్రీ?

by Ramesh N |
‘బిర్యానీ బీర్’ తాగితే తిన్నట్లేనా..? తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్స్ ఎంట్రీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త బ్రాండ్‌ బీర్లు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో ‘బిర్యానీ’ పేరుతో కొత్త బ్రాండ్ ప్రవేశపెడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయతే, రాష్ట్రంలో తాజాగా బీర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగానే కొత్త కంపెనీలకు అనుమతిచ్చామని ప్రభుత్వం పేర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఇటీవల పలు కొత్త బీర్ల కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో సోమ్ డిస్టిలరీస్, మౌంట్ ఎవరెస్ట్ లాంటి 5 కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లు తెలిసింది. ఇందులో దబాంగ్, హంటర్, లేమౌంట్ బీర్ల లాంటి కొత్త బ్రాండ్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోకి ‘బిర్యానీ బీర్’ అందుబాటులోకి రాబోతుందని తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బిర్యానీ బీర్ తాగితే.. బిర్యానీ తిన్నట్లేనా? నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed