- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదంలో బిగ్ ట్విస్ట్!
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం దుమారం ముదురుతున్న వేళ ఈ అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రారంభోత్సవం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సుప్రీంకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గురువారం జయ సుఖిన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
లోక్ సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది. కాగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో అక్కడ ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనెల 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.