- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maharashtra: మహారాష్ట్ర పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. శరద్ పవార్ తో జతకట్టబోతున్న అజిత్ పవార్?
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర పాలిటిక్స్ మరోసారి కాక రేపుతున్నాయి. అధికార మహాయుతిలో విభేదాలు భగ్గుమంటున్నాయనే టాక్ పొలిటికల్ కారిడార్ ను షేక్ చేస్తోంది. కూటమిలో ఏర్పడిన గ్యాప్ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ కూటమిని వీడి తన బాబాయ్ శరద్ పవార్ తో మళ్లీ చేతులు కలపనున్నారని లేకుంటే శరద్ పవార్ తో కలిసి బీజేపీలో చేరనున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఈ వదంతులు వినిపించడంతో ఏం జరగబోతున్నదనే రాజకీయ వర్గాల్లో మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
భవిష్యత్ కోసం పక్కా వ్యూహాం:
గత నవంబర్ లో వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 132 సీట్లు, శివసేన(షిండే) 57, ఎన్సీపీ (అజిత్ వార్) 41 సీట్లు గెలుచుకున్నారు. ఇక మహా వికాస్ అఘాడీ పేరుతో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కు 16, శివసేన (ఉద్ధవ్ థాక్రే) 20, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలకు పరిమితం అయింది. అయితే కూటమి బంపర్ విక్టరీ సాధించినా సీఎం పదవీ విషయంలో మాహాయుతి కూటమిలో తీవ్ర పోటీ ఏర్పడిందనే చర్చ జరిగింది. ముఖ్యంగా మరోసారి సీఎం పోస్టుకోసం ఏక్ నాథ్ షిండే గట్టి ప్రయత్నాలు చేసినా అజిత్ పవార్ అంగీకరించకపోవడంతో కూటమిలో బీజేపీకి వెళ్లిందనే చర్చ ఉంది. డిప్యూటీ సీఎంల పదవులు, మంత్రి వర్గంలోని పోర్టు పోలియోల విషయంలోనూ ఏక్ నాథ్ షిండే వర్సెస్ అజిత్ పవార్ మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహాయుతిలోని ఉద్దవ్ వర్గం రాబోయే స్థానిక సంస్థల్లో ఒంటరిగా ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ కోసం అజిత్ పవార్ తన బాబాయ్ శరత్ పవార్ తో చెతులు కలపబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం అజిత్ పవార్ తల్లి ఆశాతై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలని ఆమె ఆకాంక్షించారు. తన కుమారుడు అజిత్ పవార్, శరద్ పవార్ లు కలిసిపోవాలని తెలిపారు. ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్ పై మాకు అమితమైన గౌరవం ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇరు వర్గాలు కలవబోతున్నాయనే చర్చ జోరందుకుంది.