- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ తూర్పు BRS అభ్యర్థి నరేందర్‌కు బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి కీలక నేత
దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ భారీ కుదుపునకు లోను కానుంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పీఏసీఎస్ చైర్మన్, డివిజన్ స్థాయి నేతలు సైతం సిద్ధమవుతున్నారు. బీఆర్ ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న నవీన్‌రాజ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు కొంతమంది డివిజన్ స్థాయి నేతలు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్‌లో చేరే వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్ మసూద్ పేరు కూడా వినిపిస్తుండడం గమనార్హం.
మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్ధన్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, రామ తేజస్వి శిరీష్, మాజీ కార్పొరేటర్ బాసని చంద్రశేఖర్, జార్తి రమేష్ తో పాటు మరికొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ ఎస్‌లో ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో ఉన్న నవీన్‌రాజ్‌కు కొండా దంపతుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. నేడు ఉదయం రేవంత్ రెడ్డి సమక్షంలో ముఖ్యనేతలతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
నన్నపునేనికి బిగ్ షాక్!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నన్నపునేనికి టికెట్ ప్రకటించిన మరుక్షణమే పలువురు కార్పొరేటర్లు ఆయనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలకు దిగారు. ఆయనను వద్దంటూ ఏకంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజాగా నవీన్‌రాజ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవడంతో నరేందర్‌కు భారీస్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.