ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్యెల్యేకు బిగ్ షాక్!

by Disha Web Desk 5 |
ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్యెల్యేకు బిగ్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆశన్నగారి జీవన్ రెడ్డి‌కి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ డిపో స్థలంలో జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ డిపో స్థలంలో లీజ్‌కు సంబందించి విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారికి హైకోర్టు నెల రోజుల సమయం ఇచ్చినా ఎటువంటి స్పందన లేకపోవడంతో షాపింగ్ కాంప్లెక్స్ ను మూసి వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. మైక్ పట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్ అంతా తిరుగుతూ.. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గడువులోపు పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు మాల్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనౌన్స్ మెంట్‌ను గమణించాలని షాపింగ్ మాల్ లోని షాప్ రెంటర్స్‌ను అధికారులు హెచ్చరించారు.

కాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో లీజ్‌కు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు. గత కొన్నేళ్లుగా లీజ్ సంబందించిన అద్దె కట్టకపోవడంతో ఆర్టీసీ డిపోకు బకాయి పడ్డారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండటం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబందించిన అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులకు సంబందించిన నోటీసులు వెళ్లాయి. దీనిని హైకోర్టులో సవాల్ చేసిన జీవన్ రెడ్డికి విచారణ అనంతరం బిల్లులు చెల్లించేందుకు హైకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన స్పందించకపోడంతో ఈ సాయంత్రానికి షాపింగ్ మాల్ సీజ్ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

Next Story

Most Viewed