మెగా- అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టింది ఆ హీరో నేనా..? అతనెవరో ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!

by Kavitha |   ( Updated:2024-05-20 05:32:58.0  )
మెగా- అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టింది ఆ హీరో నేనా..? అతనెవరో ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ప్రస్తుతం మెగా VS అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏపీ ఎలక్షన్ సమయంలో బన్నీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవి తరపున ప్రచారం చేయడం అభిమానులకు మండిపోయేలా చేసింది. దీంతో సోషల్ మీడియాలో బన్నీకు మెగా ఫ్యాన్స్ ‘పుష్ప2’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూస్తాం అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే బన్నీ ఫ్యాన్స్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారనుకోండి. అలాగే నాగబాబు సైతం బన్నీ పై పరోక్షంగా ట్వీట్ చేసి ఆ వేడిని ఇంకా పెంచేశారు. బన్నీ సైతం అదే విధంగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఎక్కడ కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఈ సమస్య మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

మెగా అల్లు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి ఓ స్టార్ హీరోనే కారణం అంటూ.. ఆ స్టార్ హీరోకి మెగా ఫ్యామిలీ అంటే పడదు .. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అంటే అస్సలు పడదు. ఆ కారణంగా మెగా ఫ్యామిలీని దూరం పెట్టుకున్నాడు. అయితే అల్లు అర్జున్ ను మాత్రం బాగా ఫ్రెండ్షిప్ చేసి తన సినిమాలకు స్పెషల్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిపించుకున్నారు. అంతేకాదు కావాలనే అల్లు అర్జున్ కి ఉన్నవి లేనివి అన్ని చెప్పి మెగా ఫ్యామిలీ నుండి దూరం చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు ఆ హీరోకి ఇదేం పోయేకాలం అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి కరెక్ట్ పాయింట్ తో ఆ హీరోని కనిపెట్టేసి ఏకిపారేస్తున్నారు మెగా ఫ్యాన్స్

Advertisement

Next Story