- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నింటికి ఇదొక్కటే సమాధానం అంటూ శ్రీజ కామెంట్స్.. కల్యాణ్ దేవ్ గురించేనా?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అందరికీ సుపరిచితమే. ఆమె ఒకానొక సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అప్పట్లో ఈ సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. అయితే వీరికి ఓ కూతురు కూడా పుట్టాక మనస్పర్థలు ఏర్పాడ్డాయి. దీంతో శ్రీజ భర్తతో విడాకులు తీసుకుని చిరంజీవి ఇంటికి వస్తే కూతురు బాధను చూడలేక కళ్యాణ్ దేవ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వీరికి కూడా నవిష్క అనే కూతురు పుట్టింది.
అంతా బాగానే ఉందనుకునే సమయంలో.. శ్రీజ, కల్యాణ్ దేవ్ విడిపోయి దూరంగా ఉంటున్నారు. శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మెగా ఇంట్లోనే ఉంటుంది. అయితే వీరు విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అప్పుడప్పుడు శ్రీజ, కళ్యాణ్ దేవ్ పోస్టులతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా మెగా అల్లుడు అప్పుడు తన కూతురు సవిష్కను ఇంటికి తెచ్చుకుని పలు ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో విడాకులు తీసుకున్నట్లు అంతా కన్ఫమ్ చేసుకున్నారు.
ఇక అప్పటి నుంచి నిత్యం పలువురు నెటిజన్లు శ్రీజను విడాకుల గురించి అడుగుతుంటారు. కానీ ఆమె స్పందించకుండా తన లైఫ్ తాను చూసుకుంటుంది. ఇటీవల ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టా స్టోరీలో అందరి ప్రశ్నలకు గట్టి సమాధానమిచ్చింది. ‘‘ ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారు. అదే స్థాయి వాళ్లను కలుసుకుంటారు. ఎన్నో ప్రశ్నలకు ఇదొక్కటే సమాధానం అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా.. కల్యాణ్ దేవ్ గురించి పెట్టిందా.. లేక విడాకులు గురించి ప్రశ్నించే వారికి చెప్పిందా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Sreeja Konidela