- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఎంపీ వెంకటేశ్ నేత?
దిశ, బ్యూరో కరీంనగర్ : పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తాకనుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ వెంకటేశ్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అనే ఊహగానాలు జోరందుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేశ్ నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై గుర్రుగా ఉన్న వెంకటేశ్ నేత బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసిన వెంకటేశ్ నేత ఏ క్షణం అయినా బీజేపీ కండువా కప్పుకోవచ్చనే చర్చ జోరందుకుంది. అయితే బీజేపీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు తనను బుజ్జగించి వెంకటేశ్ నేతకు బీజేపీ కండువా కప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వెంకటేశ్ నేత రంగ ప్రవేశంతో పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అయితే రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకటేశ్ నేత పార్టీ మారడం కాంగ్రెస్ శ్రేణులను కలవర పరుస్తుండగా బీజేపీలో కొత్త జోష్ నింపుతోంది.