కాంగ్రెస్‌కు బిగ్ షాక్! కీలక నేత రాజీనామా

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-30 17:29:42.0  )
కాంగ్రెస్‌కు బిగ్ షాక్! కీలక నేత రాజీనామా
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఒకసారి, జూబ్లీహిల్స్ నుంచి రెండోసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా తనను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి ఎంటర్ అయింది మొదలు దాదాపు పాతికేళ్ళుగా కాంగ్రెస్‌తోనే కొనసాగానని, రెండుసార్లు (2014, 2018) ఓడిపోయినా పార్టీలోనే కొనసాగానని, ఇప్పుడు అవకాశం ఇవ్వకపోగా నేర చరిత్ర ఉన్న క్రికెటర్ అజారుద్దీన్‌కు టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆ లేఖలో పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నుంచి తప్పుకోవాల్సి వస్తున్నదని ఆ లేఖలో వివరించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో ఆదివారం రాత్రి సమావేశం కావడం, దానికి కొనసాగింపుగా మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉదయం విష్ణు నివాసానికి వచ్చి భేటీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను మీడియాకు విడుదల చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed