- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. CM రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటుపై విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లింపులు, చేసిన ఖర్చుల వివరాల కోసం విచారణ తప్పనిసరి జరిపిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణ నూతన సచివాలయం 28 ఎకరాల విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో నిర్మించబడింది. ఇంత ఎత్తైన సచివాలయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు.
మొత్తం 617 కోట్ల రూపాయలతో 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మాణం జరిగింది. మరోవైపు సచివాలయం పక్కనే ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన భారీ అంబేద్కర్ విగ్రహం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేసింది. ఆ పక్కనే ఉన్న కొత్త తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ. 179 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణంగా ఇది నిర్మితమైంది. అయితే, వీటి కట్టడాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విచారణకు ఆదేశిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిచడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.