- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TS: హైకోర్టులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాగా, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి 2019లో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని వివరాలు దాచి పెట్టారని నాగం ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.
Next Story