- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: రేపటి నుంచి తెలంగాణ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షలు.. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కాస్త గందరగోళం నెలకొంది. టెట్ నిర్వహణ, డీఎస్సీ ప్రిపరేషన్‌కు మరికొంత సమయం కవాలంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు గురువారం, జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
అయితే, పరీక్షను నిర్వాహకులు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు.. ఆన్‌లైన్ పరీక్షలు జూలై 8 నుంచి ప్రారంభమై ఆగస్టు 5 వరకు కొనసాగుతాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. హాల్ టిక్కెట్లలో తప్పులు దొర్లాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థులు రావడంతో వాటిని సరిచేసి ఆన్‌లైన్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.