- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్.. రెండుగా చీలిన టీ కాంగ్రెస్! వాట్ నెక్స్ట్?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. సీనియర్లు, వలసవాదులు అంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పీసీసీ కమిటీల నియామకం చిలికి చిలికి గాలివానలా మారింది. తాజాగా కమిటీల కూర్పును వ్యతిరేకిస్తూ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్లు పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం హస్తం పార్టీలో దుమారం రేపుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్, భట్టీ, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వంటి సీనియర్లు మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది.
కమిటీ కూర్పులోని 108 మందిలో 54 మంది వలస నేతలే ఉన్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. బలమైన సీనియర్లను కావాలనే కించపరుస్తున్నారని, ప్రశ్నిస్తే కోవర్టులు అంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పుట్టుకతో కాంగ్రెస్‌లో ఉన్న తమలో అనేక మందిని సంప్రదించకుండానే కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని హైకమాండ్ వద్దనే తేల్చుకుంటామని నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
రెండుగా చీలిన కాంగ్రెస్:
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌లో సీనియర్లు ఏకం కావడం ఇదే తొలిసారి. గతంలో అంతర్గత విషయాలపై స్పందించినప్పటికీ తాజాగా రియాక్ట్ అవుతున్న తీరు అందుకు భిన్నంగా ఉంది. నిన్నా మొన్నటి వరకు కమిటీల ఏర్పాటుపై నోరు విప్పని నేతలు ఇవాళ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరు ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డి దాడి పెంచడం ఆసక్తిగా మారింది. దీంతో ఒరిజినల్ కాంగ్రెస్ వలసవాదుల కాంగ్రెస్‌గా పార్టీలో పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు తాము పడుతున్న ఆవేదనను సీనియర్లు చెప్పుకు వచ్చారు. పార్టీని వేరే వారికి అప్పగించే కుట్ర జరుగుతోందని ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ధ్వజమెత్తారు.
వాట్ నెక్స్ట్:
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఎటువైపు దారి తీస్తుందనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా పార్టీ నేతల మధ్య ఒరిజినల్, వలస వాదులు అంటూ గ్యాప్ లైన్ ఏర్పడటంతో ఈ ఇష్యూను అధిష్టానం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. సీనియర్ల ఆగ్రహం చల్లారాలంటే రేవంత్‌ను మార్చడం ఒక్కటే పరిష్కారం అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికల హడావుడి మొదలై అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ దూకుడు పెంచాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంటే కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా కుమ్ములాటలు పెరుగుతుండటం సంచలనం అవుతోంది. అయితే కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తలెత్తితే అది ఎవరికి అనుకూలం కాబోతోందనే చర్చ తెరపైకి వస్తోంది.