- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: రాష్ట్రంలో నూతన విద్యా విధానం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూ్ళ్లుకు ధీటుగా అన్ని జిల్లాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటకు ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని 3వ తరగతి వరకు ప్లే స్కూళ్ల తరహాలో అంగన్‌వాడీల్లోనే పాఠాలు బోధించాలని అన్నారు. 4 తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా విధివిధానాలను రూపొందించాలని అన్నారు. అంగన్ వాడీల్లో ఇప్పుడున్న సిబ్బందికి మరో ఉపాధ్యాయుడిని నియమిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధికారులు కష్టపడి పని చేయాలన్నారు. అందుకు విద్యావేత్తల విలువైన సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
కాగా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల ఏర్పాటుపై సీఎస్ శాంతి కుమారి శుక్రవారం సాయంత్రం విద్యా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓకే విధంగా ఉండేలా వారంలో డిజైన్ సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ సలహాదారుతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 49 గురుకులాలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎస్‌కు తెలిపారు.