- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BIG News: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో బీజేపీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని కామెంట్ చేశారు. అదేవిధంగా దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు 1925లోనే ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని అన్నారు.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం పిటిషన్ వేశారు. అయితే, కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేస్తుండటంలో వెంకటేశ్వర్లు ఇటీవలే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.