- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం సహాయ నిధికి.. ఎస్బీఐ ఉద్యోగుల భారీ విరాళం!
దిశ, వెబ్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రతినిధులు.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎం జితేందర్ శర్మ, ఏజీఎం దుర్గా ప్రసాద్, తనూజ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో సంభవించిన అకస్మాత్తు వరదల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.5 కోట్లను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. రూ.5 కోట్ల చెక్కును ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి లకు స్వయంగా అందజేశారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎంతో మంది నిరాశ్రయులైన సంగతి తెల్సిందే. వీరికి అండగా నిలవడానికి వివిధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంకా ఎంతో మంది దాతలు విరాళాలను అందిస్తూ బాధితులకు తోడుగా నిలుస్తున్నారు. ఆపద సమయంలో వరద బాధితులకు తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.