- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు.. ఆ రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతుంది?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే అక్టోబర్, నవంబర్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని శారదపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించిన బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో సొంత వర్గంలోనే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజు సమర్థుడు కావడం వల్ల వ్యతిరేకతను అణచివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకునేందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితి రాబోతుందన్నారు.
రాష్ట్రం పాడి పంటలతో విరాజిల్లుతుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రం మరిన్ని రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. విద్యా రంగంలో సమూల మార్పులు ఉంటాయని.. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు పుష్కలంగా వస్తాయన్నారు. రాష్ట్రంలో కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు సంభవించే అవకాశం ఉందని సూచించారు. విషజ్వరాలు, కరోనాలాంటి వ్యాధులు అంతగా ప్రభావం చూపవన్నారు. అయితే వచ్చే డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆలోపే అక్టోబర్, నవంబర్‌లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు రానున్నాయని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.