- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : సోనియాగాంధీకి అస్వస్థత
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(76) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు, అతని టీం ఆధ్వర్యంలో సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12 గంటలకు సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ మేరకు సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉండాలని డాక్టర్లు తెలిపారు. అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. గతంలోనూ సోనియాకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ జరిగింది. అప్పటి నుంచి సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ సోనియాగాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.