- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
BIG BREAKING: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం మరోసారి కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద గ్రేహౌండ్స్ (Greyhounds) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు (Maoists)ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే, కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్ర నేత పాల్వంచ – మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న (DVCM Lachanna) హతమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh)లో పలు విధ్వంసకరమైన ఘటనల్లో లచ్చన్న కీలక పాత్ర పోషించాడు. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో 50 పైగానే కేసులు నమోదయ్యాయి. చర్ల ఏరియా కమాండర్‌గా లచ్చన్న భార్య తులసి వ్యవహరిస్తుంది. మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం మణుగూరుకు తరలించారు.