- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ : పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇదే!
దిశ, నల్లగొండ : భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్త తప్పుడు వార్త అని తప్పుడు ప్రచారం చేయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాది కాంగ్రెస్ రక్తం పార్టీ మార్పు వార్తలను ఖండింస్తున్నట్లు తెలిపారు. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. మొన్న రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్‌లో చేసిన దీక్షలో పాల్గొన్నాని కోమట్ రెడ్డి తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవన్నారు. నాది కాంగ్రెస్ రక్తం, బీజేపీ నుంచి ఎలాంటి ఆఫర్లు లేవని తెలిపారు. కాంగ్రెస్ కు బై చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నారు.
కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండని కోరారు. కాంగ్రెస్ అంటేనే బ్రాండ్. నేను పార్టీ మారతాననేది ఊహాగానమే అని క్లారిటీ ఇచ్చారు. గతంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేశారని మండి పడ్డారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి కొందరు లబ్ధి పొందాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదని తెలిపారు. కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా అని ఢిల్లీలో తెలిపారు.