బిగ్ బ్రేకింగ్: కవిత అరెస్ట్ అయితే అసెంబ్లీ రద్దు?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 06:32:03.0  )
బిగ్ బ్రేకింగ్:  కవిత అరెస్ట్ అయితే అసెంబ్లీ రద్దు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇవాళ రేపు వరుస సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం కానుండగా రేపు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది.

కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రేపటి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఇతర ముఖ్యనేతలకు ఇప్పటికే సమాచారం చేరిపోగా ఈ సమావేశం వెనుక ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయితే అసెంబ్లీని రద్దు చేసే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.

చాలా కాలంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతుండగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా కవితను అరెస్ట్ చేస్తే అసెంబ్లీని రద్ధు చేసి ముందస్తుకు వెళ్తారనే చర్చ గుప్పుమంటోంది. ఇందులో భాగంగానే నేడు కేబినెట్ సమావేశం, రేపు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నేతల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు అనుసరించే తీరును అంచనా వేసుకుని కర్ణాటకతో పాటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ఓ నిర్ణయానికి రాబోతున్నారని తెలుస్తోంది. అయితే ముందస్తు వెళ్లే ఆలోచన తమకు లేదని ఇదివరకే కేటీఆర్ లాంటి నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed