బిగ్ బ్రేకింగ్ : అడిషనల్ కలెక్టర్‌పై కుక్కల దాడి

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-04 03:37:39.0  )
బిగ్ బ్రేకింగ్ : అడిషనల్ కలెక్టర్‌పై కుక్కల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వీధికుక్కల దాడులు కలవరపెడుతున్నాయి. ఈ సారి ఏకంగా కలెక్టరేట్ లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి పై కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయ పరిచాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్ ఆవరణలో శనివారం రాత్రి వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది.

ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక అదే రోజు రాత్రి మరో వీధి కుక్క ఓ వ్యక్తితో పాటు, కలెక్టర్ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్ కు సమీపంలోని పౌల్ట్రీ ఫాం వద్ద ఓ బాలుడిని సైతం కుక్కలు కరిచాయి.

Advertisement

Next Story