Big Breaking: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-06 08:12:30.0  )
Big Breaking: ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యే‌లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇదే విషయమై భేటీ కానున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఫిర్యాదు అంశం సంచలనంగా మారింది.

Also Read...

Revanth Reddy: టార్గెట్ రేవంత్.. ఆ 12 మంది ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే!

KTR, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య పెద్దదైంది: Revanth రెడ్డి

'దిశ' చెప్పిందే నిజమైంది.. గ్రానైట్ స్కాంపై రంగంలోకి సీబీఐ!

Advertisement

Next Story

Most Viewed