- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BREAKING: ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం..! ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికొద్దిసేపట్లో జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలు ప్రతిపాదనలు, వినతులు అందిన నేపథ్యంలో కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, దివంగత సీఎం నందమూరి తారక రామారావుకు భారత ఇవ్వాలని ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఖ్యాతి ఇనుమడింపజేసేలా, కేంద్ర పెద్దలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ‘ఎన్టీఆర్ అంటే చరిత్ర అని, సినిమా అయినా రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిని అన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ చేసిన పాత్రలు ఎవరూ చేయలేదని, అది ఎవరికి సాధ్యం కాదని మళ్లీ ఆయనే జన్మించాలి పొగిడారు. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని, తెలుగు జాతి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కీర్తించారు.