ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బ‌చ్చ‌న్

by Ramesh N |   ( Updated:2024-03-15 12:26:58.0  )
ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బ‌చ్చ‌న్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అస్వస్థకు గురైనట్లు తెలిసింది. 81 ఏళ్ళ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ భుజం సమస్య కారణంగా శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.

కాగా, ఈ విష‌యం తెలుసుకున్న సినీ వర్గాలు బిగ్ బీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు బిగ్ బీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు చేస్తున్నారు.

Advertisement

Next Story