- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..రేపే లాస్ట్ డేట్
దిశ,వెబ్ డెస్క్:రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.దరఖాస్తు చేసుకున్నావారికి.. TSPSC దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది.దీంతో అభ్యర్థులు అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుంది.కాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ ఉంది.వ్యక్తిగత వివారల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.ఎడిట్ చేసుకోవాలంటే..దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హోం పేజీలో కనిపించే గ్రూప్-1 సర్వీస్ ఆన్ లైన్ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9 న, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.