తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..

by Disha Web Desk 12 |
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇవాళ రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించగా.. ఇంటర్ ఫస్టియర్ 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలకు సంబంధించిన రేపటి నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు తమ కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వేంకటేశం తెలిపారు. అలాగే ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed