ఆ హీరో అలా చేస్తాడనే చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

by Dishafeatures1 |
ఆ హీరో అలా చేస్తాడనే చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టీవ్ రోల్‌లో చేసి మెప్పించాడు. అయితే రాజ్ తరుణ్ ఇటీవల అక్కినేని హీరో నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్ గా ‘భలే ఉన్నాడే’ అనే టైటిల్‌ తో వస్తున్న ఈ మూవీకి జె శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవి కిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక శారీ డ్రేపర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన గీతా భగత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రైటర్ డార్లింగ్ స్వామి ఇంత చెబుతున్నారు కానీ మీరు చీరలో రాలేదు ఏమిటి ? అని అడిగితే ఆమె తడుముకోకుండా హీరో కడతాడు అని చీర కట్టుకోలేదు అని కామెంట్ చేసింది. దీంతో ఈవెంట్ కి హాజరైన వారంతా నవ్వేశారు.




Next Story

Most Viewed