- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డిపై.. డీకే అరుణ ఎదురుదాడి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి పదే పదే డీకే అరుణ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. దీంతో డీకే అరుణ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగారు. సీఎం తన స్థాయిని మరిచి, మహిళను అని కూడా చూడకుండా.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా.. వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని.. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ వచ్చినప్పుడల్లా తనని అవమానించేలా మాట్లాడుతున్నాడని డీకే అరుణ ఆరోపించారు. అలాగే పాలమూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి తమ ఓట్లతో బుద్ధి చెబుతారని డీకే అరుణ అన్నారు.