ఫ్రీ బస్సు జర్నీ మాకొద్దు.. మహిళ ఆవేదన

by Prasad Jukanti |   ( Updated:2024-05-06 13:08:48.0  )
ఫ్రీ బస్సు జర్నీ మాకొద్దు.. మహిళ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ స్కీమ్ వల్ల అనేక మంది మహిళలకు మేలు జరుగుతోందని అధికార పక్షం వాదిస్తుంటే అదంతా వట్టిదేనని మహిళలకు ఉచిత జర్నీ పేరుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ స్కీమ్ పై ఇరు పక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న క్రమంలో తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ మాకు వద్ధంటూ ఓ వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ముసలోళ్ల కాళ్లు చేతులు విరుగుతున్నాయని చచ్చిపోయే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా అనే రూట్లలో బస్సులో ఎక్కి నిల్చునే స్థలం కూడా ఉండటం లేదని తాము టికెట్ కొని నిల్చుంటే మహిళలు ఉచితంగా కూర్చుని జర్నీ చేస్తున్నారంటూ, బస్సుల్లో ఉన్న రద్ధీని కంట్రోల్ చేయడం విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోలు సైతం చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story