రోడ్లు వేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామంటూ..గిరిజనుల నిరసన

by Disha Web Desk 18 |
రోడ్లు వేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామంటూ..గిరిజనుల నిరసన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగునున్న విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా నేతలందరూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారి సమస్యలు తీర్చుతామని హామీలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నామని చెబుతున్నా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్నారే తప్ప అమలుపరచడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ చిన్న పని ఉన్న వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. వివారల్లోకి వెళితే..అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మడ్రేటు గ్రామానికి చెందిన గిరిజనులు తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసనకు దిగారు. అడవుల్లో గుర్రాల పై ప్రయాణిస్తూ ఆందోళన చేపట్టారు. తమ రవాణా అవసరాలను ప్రభుత్వం పరిష్కరించకుంటే మే 13న ఓటింగ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed